దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2019 మధ్య భారత్‌లో ఏటా 15 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది.
140 కోట్ల మంది దేశ జనాభా కూడా ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన ప్రమాణం (ఏడాదికి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములు) కంటే ఎక్కువ పీఎం2.5 వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది.
ఈ పరిశోధనలో హరియాణాలోని అశోకా వర్సిటీ, దిల్లీలోని ‘దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం’ కూడా పాలుపంచుకున్నాయి.
వాయుకాలుష్య వార్షిక స్థాయి 2019లో అరుణాచల్‌ప్రదేశ్ సుబంసిరి జిల్లాలో అత్యల్పంగా (ఘనపు మీటరుకు 11.2 మైక్రాన్లు), 2016లో ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది.
ఇది దిల్లీలో ఘనపు మీటరుకు 119 మైక్రాన్లుగా ఆ ఏడాది ఉందని పేర్కొంది.