- భారత వైమానికదళ ఉప అధిపతి (వైస్ చీఫ్)గా ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్ 2026, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో ఆయన వచ్చారు. 1985లో జాతీయ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని 1986లో వాయుసేనలో చేరిన ఆయన.. మిగ్-21, మిగ్-29 యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు విస్తృతంగా నడిపారు. మొత్తం 3,400 గంటలసేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది.
- వైస్ చీఫ్ కంటే ముందు ఆయన నైరుతి వాయుదళం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందించారు.