రైతుల స్థితిగతులను, ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూ.14,235 కోట్లతో ఏడు కొత్త పథకాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024, సెప్టెంబరు 2న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకాల వల్ల రైతులకు పంటలసాగు, మార్కెటింగ్‌కు సంబంధించి ఉత్తమ శాస్త్రీయ సమాచారం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది.