- 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.61,410 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను ఎగుమతి చేసింది. ఈ పరిశ్రమ 2030 నాటికి 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ఎయిర్‌బస్ మనదేశం నుంచి ఏటా 1.5 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను కొనుగోలు చేస్తోంది. 2030 నాటికి దీన్ని 2 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఎయిర్‌బస్ ప్రణాళిక.
- ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ అయిన శాఫ్రన్ దాదాపు రూ.1300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తన తొలి ఇంజిన్ నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌ఓ) సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. మనదేశ విమానయాన సంస్థలు దాదాపు 1500 శాఫ్రన్ ఇంజిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది.