Published on Dec 22, 2025
Current Affairs
వీబీ-జీ రాం జీ బిల్లుకు చట్టరూపం
వీబీ-జీ రాం జీ బిల్లుకు చట్టరూపం
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీ రాం జీ) బిల్లు చట్టంగా మారింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు 2025, డిసెంబరు 21న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. 
  • దీనిద్వారా ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు 125 పని దినాలకు హామీ లభిస్తుంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఎదురుకాకుండా చూడటానికి విత్తనాలు, నూర్పిళ్లు ఎక్కువగా ఉండే 60 రోజులపాటు ఈ పథకాన్ని నిలిపేస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికింద చేపట్టే పనుల ప్రణాళిక, పర్యవేక్షణ అంతా గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా నాలుగు రకాల పనులకే వీలు కల్పిస్తారు.