Published on Sep 27, 2024
Current Affairs
వాన రాకను పక్కాగా చెప్పే అర్కా, అరుణిక
వాన రాకను పక్కాగా చెప్పే అర్కా, అరుణిక

వాతావరణ మోడల్స్‌ను విశ్లేషించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్‌ ఏకంగా మూడు రెట్లకు పెంచింది. ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా వెల్లడించొచ్చు. వీటిని చెప్పే అర్కా, అరుణిక సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ 2024, సెప్టెంబరు 26న పుణెలో ప్రారంభించారు. ప్రస్తుతం పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం)లో, నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌)లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్స్‌. రూ.850 కోట్ల వ్యయంతో ఈ రెండింటి సామర్థ్యాన్ని 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు.