వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ రాధారాణి
తెలంగాణ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ డా.గురజాల రాధారాణి 2025, డిసెంబరు 18న నియమితులయ్యారు. జస్టిస్ జైశ్వాల్ పదవీ విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించింది. జస్టిస్ రాధారాణి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా ఆమె పేరును ఎంపిక కమిటీ సిఫారసు చేయగా... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.