ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా (88)ను దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ వరించింది.
2024కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ 2025, మార్చి 22న ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
సృజనాత్మక, విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు 59వ జ్ఞాన్‌పీఠ్‌కు శుక్లా ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత ఆయనే.
జ్ఞానపీఠ్‌ను అందుకున్న 12వ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు.
పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.