ప్రముఖ హిందీ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్‌కుమార్ శుక్లా (88) 2025, డిసెంబరు 23న రాయ్‌పుర్‌లో మరణించారు. శుక్లా 1937 జనవరి 1న ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు. హిందీ సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. నౌకర్ కీ కమీజ్, ఖిలేగా తో దేఖేంగే, దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ, ఏక్ చుప్పీ జగాహ్ వంటి నవలలను రచించి అందరి ప్రశంసలు పొందారు.
‘దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ’కిగాను 1999లో సాహిత్య అకాడమీ అవార్డును ఆయన పొందారు.