Published on Apr 12, 2025
Current Affairs
వినీత్‌జోషి
వినీత్‌జోషి

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషికి యూజీసీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు 2025, ఏప్రిల్‌ 11న జారీచేసింది.

ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్‌కుమార్‌ ఏప్రిల్‌ 7న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత నియామకం జరిగింది.

పూర్తిస్థాయి ఛైర్మన్‌ నియమాకం జరిగే వరకు వినీత్‌జోషి.. యూజీసీ బాధ్యతలను అదనంగా చూస్తారు.