మొక్కలు నాటడానికి, చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని ధారపోసిన ప్రకృతి ప్రేమికుడు దరిపల్లి రామయ్య (79) రెడ్డిపల్లిలో 2025, ఏప్రిల్ 12న మరణించారు.
ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. రామయ్య 1946 జులై 1న జన్మించారు.
ఆయన తన అయిదో ఏట నుంచే రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు.
ఆయన సేవలకు గుర్తింపుగా బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ 2013 ఏప్రిల్ 8న డాక్టరేట్ ప్రదానం చేసింది.
2017 మార్చి 30న నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.