Published on Jan 5, 2026
Current Affairs
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌
  • వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్‌ 2025, జనవరి 4న బాధ్యతలు చేపట్టారు. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1969లో డెల్సీ రోడ్రిగ్జ్‌ జన్మించారు. ఆమె వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్‌ అంటోనియో కుమార్తె. 
  • దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై 2025, జనవరి 3న అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం.. బంధించి న్యూయార్క్‌కు తరలించింది. ఈ పేపథ్యంలోనే ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.