Published on Nov 5, 2024
Current Affairs
విదేశీ ఫండ్లలోనూ పెట్టుబడులు
విదేశీ ఫండ్లలోనూ పెట్టుబడులు

భారత సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులున్న విదేశీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు లేదా యూనిట్‌ ట్రస్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. అయితే భారత సెక్యూరిటీస్‌ల్లో విదేశీ ఫండ్‌ సంస్థల పెట్టుబడులు వాటి మొత్తం నికర నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదనే షరతుపైనే ఈ అనుమతులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. 

ఒకవేళ విదేశీ సంస్థల పెట్టుబడి పరిమితి 25 శాతాన్ని మించితే, పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్సింగ్‌ చేసేందుకు దేశీయ ఫండ్‌ సంస్థలకు ఆరు నెలల కాలావధి లభిస్తుంది. ఈ పరిశీలనా కాలంలో విదేశీ ఫండ్‌ సంస్థల్లో అవి కొత్తగా పెట్టుబడులు పెట్టకూడదు. భారత సెక్యూరిటీస్‌ల్లో విదేశీ సంస్థల పెట్టుబడి మళ్లీ 25% లోపునకు దిగివచ్చాకే, తిరిగి తమ పెట్టుబడులను దేశీయ ఫండ్‌ సంస్థలు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది.