దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలిచింది. ఆ జట్టు చరిత్రలో మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది.
2025, మార్చి 2న ముగిసిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కేరళపై విదర్భ పైచేయి సాధించింది.
2017-18, 2018-19 సీజన్‌లలో టైటిల్ గెలుచుకున్న విదర్భ, 2024లో రన్నరప్‌గా నిలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు 249/4తో అయిదో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ.. మ్యాచ్ ముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు రాబట్టింది.