దేశ యువత కోసం ఆధునిక సేవలను అందించే దిశగా పోస్టల్ విభాగం జెన్-జడ్ థీమ్‌తో పోస్టాఫీస్‌లను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే దిల్లీలో రెండు పోస్టాఫీసులను ప్రారంభించారు. మొదటి జెన్-జడ్ పోస్టాఫీసును 2025, నవంబరు 19న ఐఐటీ దిల్లీలో, నవంబరు 20న దిల్లీ యూనివర్సిటీలో మరొక పోస్టాఫీసును ప్రారంభించారు.
పోస్టల్ విభాగం కేవలం లేఖలను పంపించడానికే కాకుండా నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా వివిధ సేవలు అందించే కేంద్రంగా మార్పు చెందిందని యువతకు చూపించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. 2026 జనవరి నాటికి మొత్తం 46 విద్యా సంస్థల్లో ఉన్న పోస్టాఫీసులను జెన్-జడ్ పోస్టాఫీసులుగా తీర్చిదిద్దడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.