వందేమాతర గీతం 150 ఏళ్ల పరిపూర్తి ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు ప్రధాన ఇతివృత్తం కానుంది. వందేమాతర గీతం ప్రారంభ చరణాల భారీ చిత్రాలను కవాతు సందర్శకుల కోసం ఏర్పాటుచేసే ఆవరణలకు నేపథ్యంగా కర్తవ్య పథ్ ప్రాంతంలో ప్రదర్శించనున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ముఖ్య అతిథులుగా ఈ కవాతును తిలకించనున్నారు.