భారత మహిళల హాకీ వెటరన్ ప్లేయర్ వందన కటారియా 2025, ఏప్రిల్ 1న ఆటకు వీడ్కోలు ప్రకటించింది. హరిద్వార్‌కు చెందిన వందన 2009లో అరంగేట్రం చేసింది.
15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ స్ట్రైకర్.. 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది.
హాకీలో వందన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ (2022), అర్జున (2021) పురస్కారాలు దక్కాయి.