దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం 2024, అక్టోబరు 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు.
* అర్హులైన వారికి ‘ఆయుష్మాన్ భారత్ వయ వందన’ కార్డులను పంపిణీ చేశారు. దేశంలో వైద్య-ఆరోగ్య రంగాలకు సంబంధించిన రూ.12,850 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు.