ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారత వృద్ధి రేటు 6.5% ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జీఎస్‌టీ - ఆదాయపు పన్ను కోతలు, కీలక వడ్డీ రేట్ల తగ్గింపు లాంటివి వినియోగ ఆధారిత వృద్ధికి దోహదం చేయనుండటమే ఇందుకు కారణంగా తెలిపింది.