Published on Oct 8, 2025
Current Affairs
వృద్ధిరేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంక్‌
వృద్ధిరేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మన దేశ వృద్ధి అంచనాలను 6.3% నుంచి 6.5 శాతానికి ప్రపంచ బ్యాంక్‌ పెంచింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగొచ్చని, వినియోగ వృద్ధి ఇందుకు అండగా నిలుస్తుందని వెల్లడించింది. భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాల ప్రభావం 2026లో కనిపించొచ్చని ప్రపంచ బ్యాంక్‌ దక్షిణాసియా డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌ (అక్టోబరు 2025)లో పేర్కొంది. అందువల్లే 2026-27 భారత వృద్ధిరేటు అంచనాను 6.5% నుంచి 6.3 శాతానికి తగ్గించింది.