Published on Nov 18, 2024
Current Affairs
వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌
వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌

అమెరికా అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధ (వైట్‌హౌస్‌) తదుపరి ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌ (27)ను ఎంపిక చేశారు. 2025, జనవరి 20న ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. అమెరికన్‌ రచయిత అయిన లెవిట్‌ ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ బృందానికి నేషనల్‌ ప్రెస్‌ సెక్రటరీగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషించారు.

ట్రంప్‌ మొదటి దఫా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరొలైన్‌ లెవిట్‌ శ్వేతసౌధ అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.