అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత సంతతికి చెందిన కుష్ దేశాయ్‌ను వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దేశాయ్ 2024లో రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా, అయోవా రాష్ట్రంలో పార్టీ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాల్లో ట్రంప్ అనుకూల పవనాలు వీచేలా కృషి చేశారు.