ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సప్ గవర్నెన్స్‌లో సేవలు 2025, మార్చి 6 నాటికి 200కు చేరాయి. జనవరి 30న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 161 రకాల సేవలతో మనమిత్రను ప్రారంభించారు.
50 రోజుల్లోనే సేవలను పెంచారు. ప్రజలకు సౌలభ్యంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో 2024 అక్టోబరులో మెటా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇటీవల పది, ఇంటర్ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వాట్సప్ ద్వారా పొందగలిగారు. ప్రజలు వివిధ రకాల పౌరసేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.