వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) ద్వారా విట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) - 2025
విట్ క్యాంపస్: వెల్లూరు క్యాంపస్, చెన్నై క్యాంపస్, విట్ భోపాల్, విట్ ఏపీ, విట్ మారిషస్.
ప్రోగ్రాం: బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్).
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్, టెక్నాలజీ ఇంజినీరింగ్, టెక్నాలజీ మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/ బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్టు ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1350.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: మార్చి 31, 2025.
ప్రవేశ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 21- 27, 2025.
ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 30, 2025.
కౌన్సెలింగ్ షెడ్యూల్: మే 2025.