- వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలన్‌లో 2026, ఫిబ్రవరి 7న ఘనంగా మొదలయ్యాయి. ఇటలీలోనే అతి పెద్ద స్టేడియమైన సా సిరోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పరేడ్‌లో అరిఫ్ మహ్మద్ ఖాన్ భారత మువ్వన్నెల పతాకాన్ని చేబూని మన బృందానికి నాయకత్వం వహించాడు. అతడు కాకుండా భారత్ నుంచి స్టాంజిన్ లండప్ మాత్రమే ఈ క్రీడల్లో పోటీపడుతున్నాడు.
- అల్పైన్ స్కీయింగ్‌లో అరిఫ్, క్రాస్ కంటీ స్కీయింగ్ స్టాంజిన్ అర్హత సాధించారు. మిలన్‌తో పాటు కోర్టినా డంపెజో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది.