Published on Aug 30, 2024
Current Affairs
‘విట్‌నెస్‌’ పుస్తకం
‘విట్‌నెస్‌’ పుస్తకం

భారత అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన సాక్షి మలిక్‌ ఆత్మకథ ‘విట్‌నెస్‌’ పుస్తక రూపంలో రాబోతుంది. దీన్ని 2024, అక్టోబర్‌లో ఆవిష్కరించనున్నారు. సాక్షితో పాటు ఈ పుస్తకానికి సహ రచయితగా జొనాథన్‌ సెల్వరాజ్‌ వ్యవహరించాడు. ఈ పుస్తకంలో సాక్షి చిన్నతనం, రెజ్లింగ్‌లో ప్రవేశం, రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడం, ఆ తర్వాత ఎదుర్కొన్న సవాళ్లు, గాయాలు, చివరగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై పోరాటం తదితర వివరాలన్నీ ఉండబోతున్నాయి.