ప్రధాని నరేంద్ర మోదీ 2025, మే 2న తిరువనంతపురంలో విఝింజమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్‌ను ప్రారంభించారు. దీన్ని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీఎస్‌ఈజడ్) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.8,867 కోట్లతో నిర్మించింది.
మనదేశానికి చెందిన అన్ని సరకు రవాణా నౌకల ట్రాన్స్‌షిప్‌మెంట్, ఏడాది వ్యవధిలోనే విఝింజమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ నుంచి నిర్వహించొచ్చని ఏపీఎస్‌ఈజడ్ పేర్కొంది.
ప్రస్తుతం మన దేశానికి చెందిన 75% వరకు ట్రాన్స్‌షిప్‌మెంట్ కార్గోను, ఇతర దేశాల్లోని పోర్టులే నిర్వహిస్తుండడంతో.. భారతీయ పోర్టులు ఏటా 200-220 మి. డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గానికి ఈ పోర్టు 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది.
ఒక చిన్న నౌక నుంచి, సుదూర గమ్యాలకు ప్రయాణించే పెద్ద నౌకల్లోకి సరకు మార్చడమే ట్రాన్స్‌షిప్‌మెంట్. ఇందువల్ల రవాణా వ్యయాలు తగ్గుతాయి. అధిక లోతైన సముద్రతీరం ఉన్న పోర్టులు ఈ ప్రక్రియకు అవసరం.