సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రాజెక్టు డైరెక్టర్ వై.జనార్దనరావు (వై.జె.రావు) 2024, డిసెంబరు 9న మృతి చెందారు.
ఆయన వయసు 94 ఏళ్లు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామానికి చెందిన వై.జె.రావు శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
రాకెట్ కేంద్రానికి అనువుగా శ్రీహరికోట దీవిని తీర్చిదిద్దే బాధ్యతలను విక్రమ్ సారాభాయ్ ఆయనకు అప్పగించారు.
అనంతరం 1972 నుంచి 1977 వరకు సంస్థ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.
అంతకుముందు వై.జె.రావు తిరువనంతపురంలోని స్పేస్ సెంటర్‌లో పనిచేశారు.