దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. మొదట విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర.. 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అథర్వ తైదె (128; 118 బంతుల్లో 15×4, 3×6) నిలిచాడు.