పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించింది. తద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేలా పోరాట సామర్థ్యాన్ని చాటింది. ఇటీవల ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.