Published on Oct 27, 2025
Current Affairs
విజ్ఞాన్‌రత్న
విజ్ఞాన్‌రత్న

దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్‌రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ 2025, అక్టోబరు 25న ఎంపికయ్యారు. ఆయనకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ‘బిగ్‌ బ్యాంగ్‌’ సిద్ధాంతాన్ని నార్లీకర్‌ తోసిపుచ్చారు. విశ్వం యావత్తూ ఒకే ఘడియలో పెను విస్ఫోటంతో ఆవిర్భవించినట్లు ‘బిగ్‌ బ్యాంగ్‌’ సిద్ధాంతం చెబుతుండగా, విశ్వం ఆద్యంతాలు లేనిదని నార్లీకర్‌ ప్రతిపాదించారు. అనంతమైన ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూనే ఉందని ఆయన వాదన. బ్రిటిష్‌ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్‌ హోయల్‌ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విజ్ఞాన శాస్త్రంలో శిఖరస్థాయికి చేరిన నార్లీకర్‌ 86 ఏళ్ల వయసులో ఈ ఏడాది మే 20న మరణించారు.