Published on Jul 20, 2024
Government Jobs
వైజాగ్‌ ఐఐఎంలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు
వైజాగ్‌ ఐఐఎంలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు:

1. జూనియర్‌ సూపరింటెండెంట్: 06 పోస్టులు

2. జూనియర్‌ టెక్నికల్ సూపరింటెండెంట్: 01 పోస్టు

3. అకౌంటెంట్‌: 01 పోస్టు

4. సీనియర్‌ సూపరింటెండెంట్: 01 పోస్టు

5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌: 02 పోస్టులు

6. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 03 పోస్టులు

7. సూపరింటెండింగ్ ఇంజినీర్‌: 01 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (మార్కెటింగ్/ ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌/ఐటీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.07.2024.

Website:https://www.iimv.ac.in/