Published on Jan 18, 2025
Current Affairs
వచ్చే రెండేళ్లూ భారత వృద్ధి 6.7%
వచ్చే రెండేళ్లూ భారత వృద్ధి 6.7%

వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు (2025-26, 2026-27) భారత వృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగొచ్చని ప్రపంచ బ్యాంకు తన తాజా అంచనాల్లో ప్రకటించింది. 2025-26లో దక్షిణాసియా వృద్ధి 6.2 శాతంగా ఉండొచ్చనీ పేర్కొంది. 

ప్రపంచబ్యాంకు విడుదల చేసిన అంచనాల ప్రకారం..

భారత్‌లో సేవల రంగం స్థిరంగా వృద్ధి చెందొచ్చు. తయారీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావొచ్చు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదం చేయొచ్చు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితం కావొచ్చు. పెట్టుబడుల్లో మందగమనం, బలహీన తయారీ ఇందుకు కారణమని పేర్కొంది.

భారత్‌ను మినహాయిస్తే దక్షిణాసియా ప్రాంత వృద్ధి 2024లో 3.9 శాతంగా ఉండొచ్చు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదార్ల విశ్వాసం దెబ్బతింది. పాకిస్థాన్, శ్రీలంక పుంజుకోవడం సానుకూలాంశం.