హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో 2026, జనవరి 28న వింగ్స్ ఇండియా-2026 సదస్సు మొదలైంది. దీని ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన విపణిగా భారత్ ఉందని ఆయన పేర్కొన్నారు. 2014లో దేశంలో 70 విమానాశ్రయాలే ఉండగా, ప్రస్తుం ఆ సంఖ్య 160 మించింది. 100కు పైగా ఏరోడ్రోమ్‌లను అందుబాటులోకి వచాయి.
చిన్న నగరాల కోసం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం ద్వారా, కొత్త మార్గాల్లో సుమారు 1.5 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2047 నాటికి దేశంలో 400కు పైగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం అని మోదీ వెల్లడించారు.