వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) 2025, నవంబరు 14న బెంగళూరులో మరణించారు. తిమ్మక్క.. దశలవారీగా కుదూరు నుంచి హులికల్ వరకు 4.5 కి.మీ. పొడవునా 385 మర్రి మొక్కలను నాటారు. అవి భారీ వృక్షాలుగా ఎదిగాయి. దీంతో పాటు తమ గ్రామంలో వృక్ష ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆమె రాష్ట్రంలో 8 వేలకు పైగా మొక్కలు మహావృక్షాలుగా ఎదిగేందుకు శ్రమించారు.
వరుసగా (సాలు) చెట్లు (మర) పెంచుతూ వచ్చిన ఆమె.. సాలుమరద తిమ్మక్కగా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు.