పద్మశ్రీ పురస్కార గ్రహీత, కర్ణాటక వృక్షమాతగా పేరొందిన తులసీ గౌడ (86) 2024, డిసెంబరు 16న కన్నుమూశారు.
ఆమె పశ్చిమ కనుమలు, కార్వార, అంకోలా చుట్టుపక్కల అడవుల్లో 35 వేలకు పైగా మొక్కలు నాటారు.
ఆయా ప్రాంతాల్లో పది లక్షల మొక్కలు నాటించిన ఘనత దక్కించుకున్నారు.
ఈమె సేవలకు 2021లో అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.