కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్)- 01
ప్రైమరీ టీచర్- 01
సబ్ ఆఫీసర్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, బీఎడ్, బీఈఎల్‌ఎడ్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ నైపుణ్యాలు, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌కు 40 ఏళ్లు; ప్రైమరీ టీచర్‌కు 30ఏళ్లు; సబ్ ఆఫీసర్‌కు 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు రూ.47,600-రూ.1,51,100; ఇతర పోస్టులకు రూ.35,400- రూ.1,12,400.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పీఈటీ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.04.2025.