Published on Jul 3, 2025
Walkins
వికారాబాద్‌ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
వికారాబాద్‌ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో  ఉద్యోగాలు

భారత ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాలలో కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు: 

1. మిల్లర్‌ (సీసీఆర్‌ ఆపరేటర్‌-సిమెంట్‌ మిల్‌): 03

2. కెమిస్ట్‌: 01

3. సూపర్‌వైజర్‌: 01

4. ట్యాలీ చెకర్‌ (మెకానిక్‌): 01

5. షిఫ్ట్‌ ఆపరేషన్‌ (మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌): 03

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: మిల్లర్‌, కెమిస్ట్‌ పోస్టులకు 35 ఏళ్లు, సూపర్‌వైజర్‌కు 58 ఏళ్లు, ఇతర పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు మిల్లర్‌కు రూ.21,000- రూ.25,000; కెమిస్ట్‌కు రూ.27,000-రూ.30,000; సూపర్‌వైజర్‌కు రూ.40,000- రూ.50,000; ఇతర పోస్టులకు రూ.25,000-రూ.30,000.

ఇంటర్వ్యూ తేదీ: 04.07.2025.

చిరునామా: సీసీఐ లిమిటెడ్‌, తాండూర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ, కరన్‌కోటే విలేజ్‌, తాండూరు మండలం, వికారాబాద్‌ జిల్లా.

Website:https://www.cciltd.in/page.php?id=216