Published on Apr 4, 2025
Current Affairs
వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025
వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025

వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం లభించింది.

2025 ఏప్రిల్‌ 3న కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టగా.. అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు.

ఏప్రిల్‌ 2న లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.

సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకత తేవటం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్‌ బోర్డు పనితీరు మెరుగుపర్చడమే ఈ బిల్లు లక్ష్యమని రిజిజు పేర్కొన్నారు.

ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధమూ లేదని, ఆస్తుల నిర్వహణలో బోర్డు పనితీరు మెరుగుపర్చటమే దీని ఉద్దేశమని తెలిపారు.

అన్నివర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్‌ బోర్డులోకి తేనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.