వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు, ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్ 5న ఆమోదం తెలిపారు.
ఈ రెండు బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల విడివిడిగా సమ్మతి తెలిపాయి.
వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (ఉమీద్-యుఎంఈఈడీ) బిల్లు’గా వ్యవహరిస్తోంది.
రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఉమీద్ చట్టంగా మారింది.