అంతులేని సమాచార భాండాగారం వికీపీడియా ప్రారంభమై 2026, జనవరి 15నాటికి 25 ఏళ్లు పూర్తయ్యింది. దేశ విదేశాల్లోని విశేషాలన్నింటినీ ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచే వేదిక ఇది. ఈ కాలంలో ఆంగ్ల వికీపీడియాలో 71 లక్షల వ్యాసాలు, వివిధ దేశాలకు చెందిన 342 భాషల్లో 6.6 కోట్లకు పైగా వ్యాసాలు పొందుపరిచారు.
2001 జనవరి 15న జిమ్మీవేల్స్, ల్యారీసాంగెర్ వికీపీడియా ప్రారంభించగా.. వివిధ దేశాల్లో లక్షలమంది స్వచ్ఛందంగా రాసేవారు ముందుకొచ్చారు. కాలక్రమంలో ఇతర భాషలకూ విస్తరించింది. కొన్ని ప్రాంతాలకే, కొందరికే పరిమితమైన సైన్స్ పేపర్లు, పుస్తకాలు, వార్తా పత్రికలు, కంప్యూటర్లు, సర్వర్లలోని విజ్ఞానాన్ని గుదిగుచ్చి ప్రపంచం ముందు ఉంచారు.
ప్రస్తుతం 353 భాషల్లో వికీపీడియా ప్రజలకు సమాచారం అందిస్తోంది.