Published on Nov 18, 2024
Current Affairs
విక్టోరియా కెజార్‌
విక్టోరియా కెజార్‌

డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌ (21) మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని కైవసం చేసుకొంది. తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించిపెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది. మెక్సికోలోని అరెనాలో నిర్వహించిన వేడుకలో మొత్తం 125 మంది పోటీదారులను దాటి ఆమె ఈ ఘనత సాధించారు. 

నైజీరియాకు చెందిన చిడీమా అడిటీనా, మెక్సికో భామ మరియా ఫెర్నాండా బెల్ట్రన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.