వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 171
వివరాలు:
1. అంగన్‌వాడీ కార్యకర్తలు (AWW): 30 పోస్టులు
2. అంగన్‌వాడీ సహాయకురాళ్ళు (AWH): 141 పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
స్థానికత: దరఖాస్తుదారులు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన వివాహిత మహిళలై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో కనీస వయస్సు 18 ఏళ్లుగా పరిగణించబడుతుంది).
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో 10వ తరగతి మార్కులకు (50 మార్కులు), ప్రీ-స్కూల్ శిక్షణ (5 మార్కులు), వితంతువులకు (5-10 మార్కులు), అనాథలకు (10 మార్కులు), వికలాంగులకు (5 మార్కులు) & ఇంటర్వ్యూకు (20 మార్కులు) కేటాయించారు.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు తమ బయోడేటా & గెజిటెడ్ అధికారి ధృవీకరించిన సర్టిఫికెట్ల నకళ్లను సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 13 ఏప్రిల్ 2026, సాయంత్రం 5:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ: 23 ఏప్రిల్ 2026.
వేదిక: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం.
Website:https://kadapa.ap.gov.in/notice_category/recruitment/