న్యాయ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 2025, ఏప్రిల్ 15న నియమితులయ్యారు. 2024, సెప్టెంబరు 3న 23వ లా కమిషన్ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, కమిషన్ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్ జైన్ (న్యాయవాది), ప్రొఫెసర్ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. గత లా కమిషన్‌లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచవచ్చో లేదో కూడా లా కమిషన్ పరిశీలించనుంది.