దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3డీ స్వదేశీ సాంకేతికతతో లద్దాఖ్‌లోని లేహ్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సైనికుల అవసరాల రీత్యా లేహ్‌లో సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఐఐటీహెచ్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. దీనికి ప్రాజెక్ట్ ప్రబల్ అని పేరు పెట్టారు. ప్రాణవాయువు తక్కువున్న ప్రాంతాల్లో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన త్రీడీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.