లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో బాక్సింగ్‌ను చేర్చనున్నారు. ఈ మేరకు బాక్సింగ్‌ను క్రీడల్లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.
ఐఓసీ 2025, ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్‌కు గుర్తింపునిచ్చింది. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘాన్ని పక్కన పెట్టినట్లయింది. అధికారాలన్నీ ప్రపంచ బాక్సింగ్‌కు దక్కాయి.
టోక్యో 2020, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలను ఐఓసీనే పర్యవేక్షించింది. పాలన విషయంలో వివాదాల నేపథ్యంలో ఐఓసీ 2023లో.. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) గుర్తింపును రద్దు చేసింది.
2028 ఒలింపిక్స్ కోసం ఐఓసీ 2022లో ప్రాథమికంగా క్రీడల జాబితాను సిద్ధం చేసింది. అందులో బాక్సింగ్ లేదు.