- మన దేశంలో హెలికాప్టర్ తయారీ సమగ్ర వ్యవస్థను నెలకొల్పడానికి అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన దిగ్గజ సంస్థ లియోనార్డో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డో అధికారులు భాగస్వామ్య అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. సైనిక అవసరాలకు తగిన హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తామని తెలిపాయి.
- భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా లియోనార్డో అధునాతన ఏడబ్ల్యూ 169ఎం, ఏడబ్ల్యూ 109 ట్రెక్కర్‌ఎం హెలికాప్టర్ల ను తయారు చేస్తారు.