అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్‌బీఏ చరిత్రలో 50 వేల పాయింట్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా లెబ్రాన్ జేమ్స్ (40 ఏళ్లు) రికార్డు సాధించాడు.
2025, మార్చి 5న న్యూఆర్లీన్స్ పెలికాన్స్‌తో మ్యాచ్‌కు ముందు 49999 పాయింట్లతో ఉన్న జేమ్స్.. తొలి క్వార్టర్‌లో త్రీ పాయింటర్‌తో మైలురాయిని చేరుకున్నాడు.
ఎన్‌బీఏలో అత్యధిక పాయింట్ల రికార్డు ఇప్పటికే జేమ్స్ పేరిట ఉంది.
44149 పాయింట్లతో లేకర్స్ దిగ్గజం కరీమ్ అబ్దుల్ జబ్బార్ రెండో స్థానంలో ఉన్నాడు.