యుద్ధంతో కకావికలమైన లెబనాన్‌లో 2022 తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది.
కొత్త ప్రధాన మంత్రి నవాఫ్ సలామ్ 2025, ఫిబ్రవరి 9న 24 మంత్రులతో క్యాబినెట్‌ను ప్రకటించారు.
అపద్ధర్మ ప్రభుత్వం వైదొలగేందుకు అనుమతించి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్లు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించారు.
నవాఫ్ సలామ్ గతంలో లెబనాన్ రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా పనిచేశారు.