దక్షిణ లెబనాన్‌లో అయిదు దశాబ్దాలుగా ఉన్న ఐరాస శాంతి స్థాపక దళం 2026 సంవత్సరాంతంలో రద్దవుతుందని భద్రతా మండలి 2025, ఆగస్టు 28న ఏకగ్రీవంగా తీర్మానించింది.
అమెరికా, దాని మిత్ర దేశమైన ఇజ్రాయెల్ దేశాలు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ తీర్మానం చేశారు.
1978లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణను పర్యవేక్షించేందుకు ఈ బలగాన్ని ఏర్పాటు చేశారు.